![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్-9 లో నిన్నటి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ల ప్రక్రియ యమజోరుగా సాగింది. పదమూడవ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ మధ్య హీటింగ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి లిస్ట్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. కళ్యాణ్ కెప్టన్ కాబట్టి ఇమ్యూనిటీ ఉంది. అతను తప్ప నామినేషన్ లో ఎవరున్నారో ఓసారి చూసేద్దాం.
గ్రాండ్ ఫినాలేకి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. పన్నెండవ వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వగా.. పదమూడవ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. ఇక నుంచి మీరు ఆడే ఆట, మాట్లాడే మాట, మిమ్మల్ని ఫైనల్‌కి చేరువకావాలా.. లేదంటే వెనుతిరగాలా అన్నది నిర్ణయించబోతున్నాయంటూ నామినేషన్స్ రూల్స్ చెప్పాడు. షుగర్ తో చేసిన సీసాను నామినేషన్ చేయాలనుకున్న కంటెస్టెంట్ తలమీద కొట్టి తగిన కారణాలు చెప్పమని బిగ్ బాస్ చెప్పాడు. ఇక నామినేషన్ ప్రక్రియని ఇమ్మాన్యుయల్ స్టార్ట్ చేశాడు. డీమాన్ పవన్, రీతూలని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేశాడు.
సంజనని భరణి నామినేట్ చేశాడు. తన ట్యాబ్లెట్లు దాచేసి ఫన్ క్రియేట్ చేద్దామని సంజన అనుకుందని అది తనకి నచ్చలేదని భరణి కారణం చెప్పి తనని నామినేట్ చేశాడు. ఆ తర్వాత డీమాన్ పవన్ ని భరణి నామినేట్ చేశాడు. ఇక సంజన, రీతూ ఇద్దరు ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు. ఇమ్మాన్యుయల్, తనూజ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, తనూజ, సంజన, రీతూ చౌదరి ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ పడాల తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు.
![]() |
![]() |